వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

నిజామాబాద్​ రూరల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని హౌసింగ్​ బోర్డు కాలనీలో వ్యభిచార గృహంపై పోలీసులు మెరుపుదాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకులతో పాటు ఓ మహిళ, పురుషుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు నాలుగు నెలలుగా అద్దె ఇంట్లో రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారని, హైదరాబాద్​కు చెందిన బ్రోకర్​ ద్వారా మహిళలను రప్పిస్తున్నారని తెలిపారు. రూరల్​ ఎస్​హెచ్​వో శ్రీనివాస్​ ఈ వివరాలను వెల్లడించారు.

సంబంధిత పోస్ట్