మోస్రాలో రోడ్డు ప్రమాదం: వ్యక్తికి తీవ్ర గాయాలు

మోస్రా శివారులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బోధన్ మండలం ఊట్పల్లి గ్రామానికి చెందిన మారయ్య మోస్రా నుంచి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి వెళ్తుండగా బోధన్ క్రాస్ రోడ్డువద్ద ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలవడంతో 108 అంబులెన్స్ ద్వారా నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్