నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని చంద్రాయన్పల్లి శివారు వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నాగ్‌పూర్ వైపు వెళ్తున్న ప్రైవేట్ అంబులెన్స్‌ను వెనుక నుంచి వచ్చిన మరో వాహనం వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో అంబులెన్స్ అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లడంతో షేక్ ఆరిఫ్ (26), షేక్ ఇస్మాయిల్‌బీ (48) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.