ఇందల్వాయి మండలంలోని జాతీయ రహదారి 44 పై దేవితండా వద్ద శుక్రవారం ఉదయం డీసీఎం బోల్తా పడింది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ కు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ నిద్ర మత్తులో డివైడర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ డీసీఎంలో డిమార్ట్కు సరుకులు తరలిస్తున్నట్లు సమాచారం.