శుక్రవారం బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకుల పల్లి భూపతిరెడ్డి హైదరాబాదులోని సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనకు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాహెర్ బిన్ హందన్, జిల్లా డిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కోపరేటివ్ కార్పొరేషన్ మానాల మోహన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.