నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ బిక్షపతిని శుక్రవారం బదిలీ చేశారు. ఆయన స్థానంలో నిజామాబాద్ కమిషనరేట్ పిసిఆర్ లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సల్వాడి రామన్నను నియమించారు. ఈ మేరకు మల్టీజోన్ 1 ఐజిపి సంపత్ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అనంతరం సల్వాడి రామన్న దర్పల్లి సీఐగా బాధ్యతలు స్వీకరించనున్నారు.