వ్యసనాలకు దూరంగా ఉండాలి ఇందల్వాయి ఎస్పై సందీప్

ఇందల్వాయి గ్రామంలో శుక్రవారం పోలీస్ కళాజాత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై సందీప్ మాట్లాడుతూ, యువత చెడు వ్యసనాలకు, ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండి గ్రామాభివృద్ధికి పాటుపడాలని సూచించారు. కళాబృందం గంజాయి, ఆన్లైన్ మోసాలు, బెట్టింగ్ వంటి అంశాలపై అవగాహన కల్పించింది. అపరిచితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని, చోరీల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, వాహనదారులు హెల్మెట్ ధరించి, సరైన పత్రాలు కలిగి ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్