శ్రీ చైతన్య క్రీడా పోటీలు: విద్యార్థుల ప్రతిభకు ఎమ్మెల్యే అభినందనలు

నిజామాబాద్ పట్టణంలో శనివారం శ్రీ చైతన్య విద్యా సంస్థల స్థాపకుడు బిఎస్ రావు జ్ఞాపకార్థం జోనల్ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. నిజామాబాద్ సిబిఎస్ఈ శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు చెస్, త్రో బాల్, క్యారమ్, రిలే వంటి విభాగాల్లో విజేతలుగా నిలిచారు. గెలిచిన విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్త బహుమతులు అందజేసి, క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కో-ఆర్డినేటర్ మహిపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ గురుచరణ్, ఐపిఎల్ ఇంచార్జ్ శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్