నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న రామ్ చరణ్ (15) మంగళవారం (మార్చి 03) బడి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన ఈ బాలుడి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వ్యక్తిగత కారణాలా లేక చదువుల ఒత్తిడా అనే కోణంలో విచారణ జరుగుతోంది. తోటి విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.