ధర్పల్లి మండలంలోని గోవింద్పల్లికి చెందిన కర్రోళ్ల లక్షిత (22) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఏడాది క్రితం మోస్రాకు చెందిన నెహ్రూతో వివాహమైన లక్షితకు, రూ. 2 లక్షల అదనపు కట్నం కోసం పెళ్లైన రెండు నెలల నుంచే భర్త నెహ్రూ, అతని తల్లిదండ్రులు వేధించినట్లు ఆరోపణలున్నాయి. పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా మార్పు రాలేదని, ఈ నేపథ్యంలోనే ఆమె మృతి చెందిందని సమాచారం. మృతదేహాన్ని నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ శాంత పరిశీలించారు.