ఓటరు జాబితా సవరణను పరిశీలించిన తాహసీల్దార్ శాంత

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కేంద్రంలోని (ZPHS) పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (SIR) కార్యక్రమాన్ని తాహసీల్దార్ టి. శాంత పరిశీలించారు. ఓటరు నమోదు, వివరాల సవరణ, ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ ప్రక్రియను ఆమె పర్యవేక్షించి, అధికారులకు సూచనలు చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, పారదర్శకంగా ఓటరు నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు.

సంబంధిత పోస్ట్