మీసేవా నిర్వాహకులతో తహసీల్దార్ శాంత సమావేశం

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండల కార్యాలయంలో బుధవారం తహసీల్దార్ టి. శాంత ఆధ్వర్యంలో మీసేవా సెంటర్ల నిర్వాహకులతో సమావేశం జరిగింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు వేగంగా, పారదర్శకంగా అందించాలని, ఆన్‌లైన్ దరఖాస్తుల నిర్వహణలో నిబంధనలు పాటించాలని, ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని నిర్వాహకులకు ఆమె సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఐ, ప్రభుత్వ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్