నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కోటిమంది మహిళలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తుందని తెలిపారు. DRDA ఆధ్వర్యంలో మెప్మా సౌజన్యంతో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గూపన్ పల్లిలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత చీరల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గూపన్ పల్లి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్లో అహంకారం స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే విమర్శించారు.