ట్రాన్స్ ఫార్మర్స్ను ధ్వంసం చేసిన దుండగులు

మోపాల్ మండల కేంద్రంలోని గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులో ఉన్న కాపర్, ఆయిల్ను ఎత్తుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. గ్రామ శివారులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉండటం వల్ల దుండగులు విలువైన కాపర్ వైర్లు, ఆయిల్ను దొంగిలిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద ఎటువంటి రక్షణ లేకపోవడమే దీనికి కారణమని వారు పేర్కొన్నారు. సంబంధిత విద్యుత్ శాఖ అధికారులు ఈ ఘటనపై స్పందించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్