డిచ్పల్లిలోని 44వ జాతీయ రహదారిపై నాగపూర్ గేట్ చౌరస్తా వద్ద వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంలో బైక్ పై నుంచి రోడ్డుపై పడిపోయిన యువకులపై అదే మార్గంలో వెళుతున్న లారీ దూసుకెళ్లడంతో ఈ ఘోరం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.