ఒకే ఈతలో రెండు ఆడ దూడలు: రైతు సంతోషం, వైద్యుడికి ప్రశంసలు

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని రేకులపల్లి గ్రామానికి చెందిన పాడి రైతు మార్కంటి సంతోష్ గారి జెర్సీ ఆవు 22/12/2025న ఎదకు రావడంతో, రామడుగు ప్రాజెక్ట్ గ్రామానికి చెందిన గోపాలమిత్ర ఎండి డాక్టర్ సర్దార్‌ను సంప్రదించారు. ఆయన తక్షణమే స్పందించి, ఆవుకు కృత్రిమ గర్భధారణ చేయగా బుధవారం ఆ పశువు ఒకే ఈతలో రెండు ఆడ దూడలకు జన్మనిచ్చింది. ఈ అరుదైన సంఘటనతో గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. గ్రామ పెద్దలు, పశు యజమాని డాక్టర్ సర్దార్‌ను ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్

✕
✕