ముత్యాల చెరువు నిర్మాణంపై గ్రామస్తుల ఆందోళన, అధికారులకు అడ్డు

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలం వాడి, హోన్నాజీపేట్, బీరప్ప తండా గ్రామాల ప్రజలు బుధవారం ముత్యాల చెరువు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ సర్వేకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఆస్తి, ప్రాణ నష్టం సంభవించే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. గత సంవత్సరం జరిగిన నష్టం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించలేదని, అయినప్పటికీ పనులు మళ్లీ ప్రారంభిస్తున్నారని సర్పంచులు తెలిపారు.

సంబంధిత పోస్ట్