నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 32 ద్వారా తెలంగాణ విశ్వవిద్యాలయానికి ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేశారు. ఇందుకు గాను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ టి యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొ ఎం యాదగిరి పత్రికా సమావేశం ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.