నిజామాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (NAC) ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్, మేసన్, టైలరింగ్ ట్రేడ్లలో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ 3 నెలల శిక్షణా కార్యక్రమానికి రూ.18,000 ఫీజు కాగా, ప్రభుత్వం తరఫున 50% రాయితీతో అభ్యర్థులు కేవలం రూ.9,000 చెల్లిస్తే సరిపోతుందని ఆయన పేర్కొన్నారు.