దుబ్బాక రైతు వేదికలో 9వ జాతీయ పోషణ మాసోత్సవం

ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలోని రైతు వేదికలో శనివారం 9వ జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2026 సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు దేశవ్యాప్తంగా పోషణ మాసోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది “హమారీ అంగన్‌వాడీ. హమారీ జిమ్మేదారీ” అనే ప్రధాన ఇతివృత్తంతో పోషకాహారం, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం, సమతుల్య ఆహారంపై అవగాహన కల్పిస్తున్నారు. దుబ్బాకలో నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలు, ప్రజలకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీడీపీఓ ఫర్హత్ సర్పంచ్ సరోజిని దేవి, డిచ్‌పల్లి ప్రాజెక్టు సూపర్‌వైజర్లు సరిత, రచన, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕