ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కల్లు ప్యాకెట్లు కలకలం సృష్టించాయి. ఆసుపత్రి ఆవరణలో కల్లు ప్యాకెట్లతో తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను సెక్యూరిటీ గార్డులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కల్లు ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, ఒకటో ఠాణా పోలీసులకు అప్పగించారు. విచారణలో ఆ వ్యక్తులు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారు. వారిలో ఒకరు మైనరా లేక యువకుడా అనేది తెలియాల్సి ఉంది. మధ్య వయస్కుడైన వ్యక్తి తన పేరు సిద్ధార్థ అని, సిరిసిల్లా జిల్లాలోని రావుడ గ్రామానికి చెందినవాడిగా చెప్పాడు.