ఏకలవ్య విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి. *

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ లో 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) నాయకులు పాఠశాలకు వెళ్లి వివరాలు సేకరించడానికి ప్రయత్నించారు. అయితే, పాఠశాల అధికారులు విద్యార్థులతో మాట్లాడే అవకాశాన్ని కల్పించకుండా అడ్డుకున్నారు. విద్యార్థి మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడి విద్యార్థులు ధర్నా చేపట్టారు. PDSU జిల్లా అధ్యక్షులు కర్క గణేష్ మాట్లాడుతూ, విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్