ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం

ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా నిజామాబాద్ లోని తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆదివారం ఉత్సాహంగా సంబరాలు నిర్వహించారు. నాలుగు ప్రధాన పోస్టుల్లో మూడు స్థానాలను ఏబీవీపీ కైవసం చేసుకుంది. అధ్యక్షుడు, కార్యదర్శి, జాయింట్ సెక్రటరీ స్థానాల్లో ఏబీవీపీ అభ్యర్థులు విజయం సాధించడంతో విద్యార్థులు టపాసులు పేల్చి ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రెసిడెంట్ సమీర్, సెక్రటరీ మోహన్, నాయకులు ప్రవీణ్, అనిల్, ప్రీతం, విఘ్నేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕