డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు నిజామాబాద్ కోఆర్డినేటర్ రంజిత ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత గల అభ్యర్థులు ఆగస్టు 13వ తేదీ లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీలో ఎంపీసీ, బీజెడ్సీ కోర్సులు, పీజీలో ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, డిప్లొమా బీఎల్ఎ్స కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆన్ లైన్లో దరఖాస్తు అనంతరం అధ్యయన కేంద్రంలో అప్లికేషన్ అందజేయాలని ఆమె సూచించారు.