నిజామాబాద్: జాతీయ ఉత్తమ టీచర్లకు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలోని పాఠశాలల్లో విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయినిలు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయినిల నుంచి 2025వ సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పురస్కారం ఎంపిక కొరకు మానవ వనరుల మంత్రిత్వ శాఖ, ఢిల్లీ ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో ఆశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 17 వరకు పొడిగించడం జరిగిందన్నారు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ లో http: //nationalswardstoteachers. education. gov. in లో సంబంధిత ధ్రువపత్రాలు అప్లోడ్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్