నిజామాబాద్ అర్బన్, రూరల్ పరిధిలోని దమ్మన్నపేట గ్రామపంచాయతీలో VBGRAM-G ఉపాధి హామీ పథకం కింద గ్రామ పటంపై అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ప్రతి కూలీ కుటుంబానికి 125 రోజుల పని కల్పించేలా గ్రామపంచాయతీలు ప్రణాళిక రూపొందించాలని సర్పంచ్ వసంత రమేష్ సూచించారు. గ్రామ పటం ద్వారా వనరులు, వాటి వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.