మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులకు బారికేడ్లు, హోర్డింగులు అందజేత

నిజామాబాద్ జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ, మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు బారికేడ్లు, హోర్డింగులను అందజేశారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠి చేతుల మీదుగా వీటిని అందించారు. 'బేటీ బచావో – బేటీ పడావో' కార్యక్రమంలో భాగంగా బాలికల లింగ నిష్పత్తిని పెంచేందుకు ప్రజల్లో అవగాహన పెంపొందించేలా ఈ బారికేడ్లు, హోర్డింగులు అందజేయడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్