వివేకానంద జయంతి సందర్భంగా బైక్ ర్యాలీ*

జనవరి 12న, స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో ఇందూర్ నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏబీవీపీ కార్యాలయం నుండి స్వామి వివేకానంద విగ్రహం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో ఇందూర్ విభాగ్ ప్రముఖ్, పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ పాల్గొన్నారు. స్వామి వివేకానంద మాటలు యువతలో స్ఫూర్తిని నింపుతాయని, 'లే మేలుకో నీ గమ్యం చేరే వరకు విశ్రమించకు' అనే వారి సందేశం యువతను మేల్కొల్పుతుందని ఆయన అన్నారు. 'మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా' అని ప్రపంచానికి చాటిన, 'వసుధైవ కుటుంబకం' అని ప్రపంచానికి చెప్పిన మహానుభావుడు స్వామి వివేకానంద అని ఆయన కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్