అభ్యర్థులు ఖరారు... ప్రచారం షురూ

మున్సిపల్ ఎన్నికల్లో కీలక ఘట్టం ప్రారంభమైంది. అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణలు పూర్తయ్యాయి. పార్టీలు బీఫామ్ లు అందించడంతో అభ్యర్థుల లెక్క తేలిపోయింది. మంగళవారం నామినేషన్ల ఉపసంహరణ గడువులోగా భారీగా ఉపసంహరణలు జరిగాయి. ఒక్కో వార్డులో ఇద్దరికి మించి నామినేషన్లు వేసిన అభ్యర్థులకు పార్టీ టికెట్లు ఖరారు అయ్యాయి. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారం మొదలైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్, భీంగల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటీ రసవత్తరంగా మారింది.

సంబంధిత పోస్ట్