నిజామాబాద్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ సతీమణి, సీనియర్ డాక్టర్ సుచి యాష్కీ కారు అమెరికాలో ప్రమాదానికి గురైంది. కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సులో చేర్పించి తిరిగి వస్తుండగా, బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వెళ్లే మార్గంలో వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో సుచి యాష్కీకి తీవ్ర గాయాలయ్యాయి, ఆమెకు రిబ్స్ విరిగినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు.