కేంద్ర పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలి

బోర్గాం లో బీజేపీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ సమక్షంలో శుక్రవారం ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికలు లేనప్పుడు కూడా సమాజంలో పార్టీ కార్యకలాపాలు నిరంతరం కొనసాగాలని, అన్ని అనుబంధ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సంస్థల లక్ష్యం ఒకటేనని, మోడీ నేతృత్వంలో భారత్ ప్రపంచంలో గౌరవం పెంచుకుందని, అనేక పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్