ధర్పల్లి గ్రామంలో వీడిసి ఆధ్వర్యంలో మాటు కాలువ శుభ్రం

ధర్పల్లి మండల కేంద్రంలో విలేజ్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలోని చెరువులోకి వచ్చే మాటు కాలువను విలేజ్ కమిటీ చైర్మన్ ఆర్మూర్ రంజిత్, వీడీసీ సభ్యులు కాలువలోని చెత్తాచెదారాన్ని, పిచ్చి మొక్కలను, కాల్వలో పేరుకుపోయిన చెత్తను జెసిపి సహాయంతో శుభ్రం చేయించారు. వర్షాకాలంలో వచ్చే నీరు కాలువ నుండి అధికంగా వస్తుందని వీడిసి చైర్మన్ తెలిపారు. చిలుక సాయి కృష్ణ, బంగారు గంగ కుమార్, మీసం శోభన్ రాజ్, దాసరి గంగాధర్, శిరస్సు రాకేష్, వీడిసి సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్