ధర్పల్లి మండలంలోని బేల్య తండాకు చెందిన మెగావత్ దావజీ, గుండె ఆపరేషన్ కోసం మంజూరైన సీఎం సహాయనిధి చెక్కును డీసీసీ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్ అందజేశారు. ఆర్థిక సాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి, కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుజీ, తండా నాయకులు లచ్య, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ చక్రపాణి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నిమ్మల వినయ్ గౌడ్, పాల్గొన్నారు.