ధర్పల్లిలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో నిర్మిస్తున్న వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను గురువారం జిల్లా కలెక్టర్ త్రిపాఠి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి నిర్మాణంలో 80% పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్ కలెక్టర్ కి తెలిపారు. ఈ పర్యటనలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివ శంకర్, తహసీల్దార్ టీ శాంత, ఎంపీడీవో బి. మారుతి, మెడికల్ ఆఫీసర్ అజయ్ రెడ్డి, ఇతర అధికారులు మరియు సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕