మీడియా సెంటర్, ఎంసిఎంసి కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్*

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసిఎంసి) సెల్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం సందర్శించారు. ఎన్నికల సమయంలో ఎంసిఎంసి ద్వారా జరుగుతున్న పనుల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఎంసిఎంసి కేంద్రంలోని రికార్డులను తనిఖీ చేసి, కంట్రోల్ రూమ్ ను సందర్శించి, ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సూచనలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్