నగరంలోని ఆర్ఆర్చౌరస్తా వద్ద స్థానిక రెండో టౌన్లో కెతావత్ వెంకట రాములు అనే బాధితుడు ఫిర్యాదు చేశారు. గతనెల 12న ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ కొరియర్ ద్వారా నాలుగు ట్యాబ్లున్న పార్శిల్ పంపినట్లు తెలిపారు. అయితే, పార్శిల్ చేరాల్సిన స్థలానికి చేరలేదని, విచారించగా కొరియర్ సిబ్బంది దానిని మిస్‌ప్లేస్ చేసినట్లు తెలిసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొరియర్ బ్రాంచ్ మేనేజర్‌ను సంప్రదించినా సరైన సమాచారం లభించలేదని, తమకు న్యాయం చేయాలని బాధితుడు కోరారు.