మైనార్టీ మహిళల ఆర్థిక స్వావలంబనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలో మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో, తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్హులైన మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడుతోందని షబ్బీర్ పేర్కొన్నారు.