ధర్పల్లి మండల కేంద్రంలోని యువరత్న గణేష్ మండపాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గాదె నరేష్ సందర్శించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆయనతో పాటు మండల ఉపాధ్యక్షులు నిమ్మల వినయ్ గౌడ్, వకీల్ రాకేష్, నవీన్, కార్తీక్, డి. సాయి, సాయి, నందు తదితరులు పాల్గొన్నారు. మండప నిర్వాహకులతో మాట్లాడి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు.