ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం: నిజామాబాద్‌లో ముగ్గు పోసిన నాయకులు

నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని మోబిన్ సాబ్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని చెరువు తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భూమి సక్రియ, అను గోవింద, సునీత గంగాధర్‌లకు మంజూరైన ఇళ్లకు నాయకులు బుధవారం ముగ్గు పోశారు. ఈ సందర్భంగా ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు బాలరాజు, సర్పంచ్ మలావత్ బాలు, గ్రామ పెద్దలు, కార్యదర్శి దిలీప్, జీపీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕