సంక్రాంతి పండగ నేపథ్యంలో కోడిపందాలు, పేకాట ఆడితే చర్యలు సీపీ

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్లలో పేకాట, కోడిపందాలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలపై నిఘా పెంచామని, సరిహద్దు ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశామని, మహారాష్ట్ర సరిహద్దు పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశామని ఆయన పేర్కొన్నారు. పట్టుబడిన వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్