పిడుగుపాటుకు పాడి గేదె మృతి

సిరికొండ మండలంలోని మైలారం గ్రామ శివారులో ఆదివారం పిడుగుపాటుకు పాడి గేదె మృతి చెందింది. సేవాలాల్ తండాకు చెందిన భాగవత్ లింబాద్రి పశువులను మేతకు తీసుకెళ్లిన సమయంలో ఒక్కసారిగా వర్షం కురిసింది. భారీ ఉరుములు, పిడుగుల మధ్య పిడుగు పడటంతో ఆయనకు చెందిన పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. పిడుగు శబ్దానికి తాను కూడా స్పృహ కోల్పోయి కిందపడిపోయానని లింబాద్రి తెలిపారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ. 95 వేలు ఉంటుందని, తీవ్రంగా నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు ఘటనను పరిశీలించి నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్

✕
✕