చెక్కులు అందజేస్తున్న డీజీపీ శివధర్రెడ్డి, సీపీ సాయిచైతన్య

మరణించిన సీసీఎస్ పోలీస్ కానిస్టేబుల్ ఎంపల్లి ప్రమోద్ కుమార్ పిల్లల విద్యాభ్యాసానికి డీజీపీ శివధర్ రెడ్డి చేతుల మీదుగా శనివారం చెక్కులు అందజేశారు. పిల్లల చదువుకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చిన టెర్మినల్ గ్రూప్ సీఎండీ ఎస్పీ రెడ్డిని డీజీపీ అభినందించారు. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, వారి కుటుంబాలకు అండగా ఉంటామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయి చైతన్య కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్