నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలో సోమవారం ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ కావ్య మధు, ఉపసర్పంచ్ శ్రీను, పంచాయతీ కార్యదర్శి వనజ లబ్ధిదారులకు ఈ పత్రాలను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకాన్ని అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.