దుబ్బాక పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ

నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్ మండలంలోని దుబ్బాక గ్రామ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో బుధవారం  విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో సమకూర్చిన ఈ డ్రెస్సులను ఉపసర్పంచ్ కోతి శేఖర్‌రెడ్డి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను క్రీడల వైపు ప్రోత్సహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్