ధర్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా డాక్టర్స్ డే వేడుకలు

నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండల కేంద్రంలో డాక్టర్ శివశంకర్ ఆధ్వర్యంలో జాతీయ డాక్టర్స్ డే వేడుకలు బుధవారం  ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైద్యుల సేవలను కొనియాడుతూ కేక్ కట్ చేశారు. డాక్టర్ శివశంకర్ మాట్లాడుతూ వైద్య వృత్తి అత్యంత బాధ్యతాయుతమైన సేవ అని, రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం ప్రతి వైద్యుడి కర్తవ్యమని, సమాజ ఆరోగ్య పరిరక్షణలో వైద్యుల పాత్ర కీలకమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు, సిబ్బంది, ప్రముఖులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్