గ్రామాల్లో కుక్కల స్వైర విహారం.. ప్రజల భయాందోళన

గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా కమ్మర్ పల్లి మండలంలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది. విశ్వాసానికి మారుపేరైన కుక్కలు ఇప్పుడు మనుషులపై దాడులకు దిగుతున్నాయి. గుంపులుగా తిరిగే కుక్కల వల్ల ప్రజలు, ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముగ్గురిపై కుక్కలు దాడి చేయగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీధి కుక్కల నియంత్రణ, వాటి వల్ల వచ్చే వ్యాధులపై అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కుక్కల బెడద నుంచి రక్షణ కల్పించాలని స్థానిక అధికారులను కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్