కరువు మండలాలను ప్రకటించి నష్టపరిహారం ఇవ్వాలి

అనావృష్టితో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నందున కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరుతూ ధర్పల్లి మండల డిప్యూటీ తహసీల్దార్‌ సాయిల్ కు సీపీఐ(ఎంఎల్‌) బాలయ్య, నాయకులు వినతిపత్రం అందజేశారు. పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, రేషన్‌ దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. మంచిప్ప 21 ప్యాకేజీ పనులను వేగవంతం చేసి 84 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వి. బాలయ్య, మందాపురం నర్సాగౌడ్, నిమ్మల భూమేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕