ధర్పల్లి మండల గ్రామ సచివాలయ కార్యదర్శుల నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు సంఘం అధ్యక్షుడు సాయికుమార్ తెలిపారు. ఉపాధ్యక్షుడిగా గంగాధర్, ప్రధాన కార్యదర్శిగా చైతన్య, కోశాధికారిగా ప్రవీణ్, సలహాదారుగా వనజ ఎన్నికయ్యారని తెలిపారు. మండల కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తమ వంతు ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులకు నూతన కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది.