ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య మృతి తీరని లోటు

నిజామాబాద్ పట్టణంలో 23 జనవరి సాయంత్రం గంజాయి మాఫియా దుశ్చర్యకు గురైన కానిస్టేబుల్ గాజుల సౌమ్య, 31 జనవరి రాత్రి 9.45 గంటలకు NIMS ఆసుపత్రిలో మృతి చెందారు. మూత్రపిండాలు, ప్లీహం, కాలేయం కోల్పోయి తొమ్మిది రోజులుగా మృత్యువుతో పోరాడిన సౌమ్య, విధి నిర్వహణలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించి ప్రాణత్యాగం చేశారని నిజామాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి తెలిపారు. ఆమె త్యాగం ఎక్సైజ్ శాఖ ప్రతిష్టను పెంచిందని, ఆమె సాహసం అసమానమైనదని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి పేర్కొన్నారు. సౌమ్య తల్లిదండ్రులు నిత్యావసర సరుకులు అమ్ముకుని జీవనం సాగిస్తుండగా, తమ్ముడు SI పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్