నిజామాబాద్ జిల్లాలో ఐదేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో ప్రైవేట్ కళాశాలల మనుగడ కష్టతరమైందని ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ రెడ్డి తెలిపారు. లాభాపేక్ష లేకుండా నాణ్యమైన విద్యను అందిస్తున్న తమకు ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం శోచనీయమని ఆయన అన్నారు. ప్రైవేట్ కళాశాలల్లో చదివిన విద్యార్థులు కార్పొరేట్ స్థాయిలో ఉద్యోగాలు పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.